Suma: సుమ.. పంచాయితీ

బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న సుమ కనకాల.. ఇప్పుడు ‘జయమ్మ పంచాయితీ’ అనే చిత్రంతో వెండితెరపై సందడి చేయనుంది. కలివారపు విజయ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ  సినిమాని...

Updated : 06 Dec 2022 13:59 IST

బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న సుమ కనకాల.. ఇప్పుడు ‘జయమ్మ పంచాయితీ’ అనే చిత్రంతో వెండితెరపై సందడి చేయనుంది. కలివారపు విజయ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ  సినిమాని బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి  స్వరాలందిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను హీరో రామ్‌చరణ్‌ శనివారం విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో సుమ పాత కాలం నాటి రోలు ముందు కూర్చొని సీరియస్‌గా  రోకలితో పోటేస్తూ కనిపించారు. ఆమె దెబ్బకు రోలు పగుళ్లు రావడాన్ని పోస్టర్‌లో చూడొచ్చు. అలాగే ఆమె చీర కొంగుపై ఓ గ్రామీణ వాతావరణాన్ని.. ఆ ఊరిలోని ప్రజల్ని చూపించారు. ఈ ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇందులో సుమ పాలకొండ అనే గ్రామ పెద్దగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఊరిలో ఈ జయమ్మ పంచాయితీ ఏంటో తెలియాలంటే.. ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ఈ సినిమా ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, ఛాయాగ్రహణం: అనుష్‌ కుమార్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని