Arjuna Phalguna: పులి అవుతావో బలి అవుతావో.. స్ఫూర్తినింపేలా ‘అర్జున ఫల్గుణ’ గీతం

శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృతా అయ్యర్‌ నాయిక.  తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 07 Dec 2022 17:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీవిష్ణు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృతా అయ్యర్‌ నాయిక. తేజ మర్ని దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కాపాడేవా రాపాడేవా’ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ సాహిత్యం అందించగా ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ స్వరాలు సమకూర్చారు. మోహన భోగరాజు ఆలపించారు. కథానాయకుడి పాత్రకు ప్రతికూల పరిస్థితులు ఎదురైన సమయంలో వచ్చే గీతమనిపిస్తోంది. సమస్యలకు తలవంచకుండా అనుకున్నది సాధించాలనే స్ఫూర్తినిస్తోంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘గోదారోళ్లే’ సాంగ్, టీజర్‌కు విశేష స్పందన లభించింది. నరేష్‌, శివాజీరాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్‌, రంగస్థలం మహేష్‌, రాజ్‌కుమార్‌ చౌదరి, చైతన్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి, కళ: గంధి నడికుడికర్‌, మాటలు: సుధీర్‌వర్మ.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని