Published : 18 Sep 2021 13:02 IST

Seetimarr: ‘కబడ్డీ ఆంథమ్’‌.. సీటీమార్‌ అనాల్సిందే..!

హైదరాబాద్‌: మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ ‘సీటీమార్‌’. గోపీచంద్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమా వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్‌ 10న ప్రేక్షకులకు ముందు వచ్చి సూపర్‌ హిట్‌ అందుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘కబడ్డీ ఆంథమ్‌’ ఫుల్‌ వీడియోని చిత్రబృందం శనివారం విడుదల చేసింది. ‘నువ్వా-నేనా.. నేనా-నువ్వా’ అంటూ సాగే ఈ పాట ఈలలు వేయించేలా ఉంది. ఇందులో గోపీచంద్‌ ఆంధ్రప్రదేశ్‌ టీమ్‌కి, తమన్నా తెలంగాణ టీమ్‌కి కబడ్డీ కోచ్‌లుగా నటించారు.

పక్కా మాస్, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకి సంపత్‌ నంది దర్శకత్వం వహించారు. ‘గౌతమ్‌నంద’ తర్వాత గోపీచంద్‌ - సంపత్‌నంది కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా ఇది. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. భూమిక, రావు రమేశ్‌, పోసాని కృష్ణ మురళీ, అన్నపూర్ణ, ప్రగతి కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ స్వరాలు అందించారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని