Kaikala Satyanarayana: సినీ నటుడు కైకాల ఆరోగ్యం విషమం

ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్య బృందం..

Updated : 21 Nov 2021 07:04 IST

ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ(86) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. శనివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్‌ జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. పరిశీలించిన వైద్య బృందం.. పోస్ట్‌ కొవిడ్‌ ప్రభావంతో శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయని, ఆరోగ్యం పూర్తిగా విషమించిందని వెల్లడించింది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని తెలిపింది. గత నెల 30వ తేదీన ఇంట్లో జారిపడటంతో ఆసుపత్రిలో చేరిన ఆయనకు కొవిడ్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ తర్వాత కోలుకొని ఇంటికి చేరుకున్నారు. శనివారం శ్వాస సంబంధిత ఇబ్బందితో ఆసుపత్రిలో మళ్లీ చేరారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆరోగ్యం మెరుగుపరిచేందుకు  ప్రయత్నిస్తోందని అపోలో వైద్యవర్గాలు తెలిపాయి. దాదాపు 60ఏళ్ల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో మెరిసిన కైకాల వైవిధ్యమైన నటనతో నవరస నటనా సార్వభౌమ బిరుదును పొందారు. వయోధిక సమస్యలతో గత రెండేళ్లుగా సినిమాలకూ  విరామమిచ్చారు. 1996లో మచిలీపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

- ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, ఫిల్మ్‌నగర్‌, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని