Kangana Ranuat: కత్రినా-విక్కీ పెళ్లి.. పొగుడుతూ పోస్ట్‌ చేసిన కంగన

బాలీవుడ్‌ నటీనటులు కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. రాజ్‌స్థాన్‌లోని సిక్స్‌ సెన్సెన్స్ ఫోర్ట్‌లో వీరి వివాహ వేడుకలు ఎంతో....

Published : 08 Dec 2021 15:04 IST

ముంబయి: బాలీవుడ్‌ నటీనటులు కత్రినాకైఫ్‌-విక్కీ కౌశల్ మరికొన్ని గంటల్లో వివాహబంధంతో ఒక్కటి కానున్న విషయం తెలిసిందే. రాజ్‌స్థాన్‌లోని సిక్స్‌ సెన్సెన్స్ ఫోర్ట్‌లో వీరి వివాహ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. వీరి వివాహంపై తాజాగా నటి కంగనా రనౌత్‌ స్పందించారు. ఈ జంటపై పరోక్షంగా పొగడ్తల వర్షం కురిపించారు. ‘‘సమాజంలో ఎంతోమంది ధనవంతులైన పురుషులు తమకంటే వయసులో చిన్నవారినే పెళ్లి చేసుకుంటారు.. భర్త కంటే భార్యకు పేరు, పలుకుబడి ఎక్కువగా ఉంటే ఆ వివాహబంధంలో కలతలు వస్తాయి.. ఇలాంటి ఎన్నో నిబంధనలు గురించి వింటూ నేను పెరిగాను. ఇప్పుడు.. చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సక్సెస్‌, ధనవంతులైన నటీమణులు ఆ నిబంధనలకు స్వస్తి పలుకుతూ వివాహబంధంలోకి అడుగుపెట్టడం నాకెంతో ఆనందంగా ఉంది’’ అని కంగన తెలిపారు.

ఇక, విక్కీ-కౌశల్‌ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు. బాలీవుడ్‌లో జరిగిన పలు పార్టీల్లో ఈ జంట ప్రత్యేకార్షణగా నిలిచింది. వీరి పెళ్లి వార్తతో బీటౌన్‌లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం సెలబ్రిటీలందరూ రాజ్‌స్థాన్‌కి పయనమవుతున్నారు. ఇక వయసు పరంగా చూసుకుంటే కత్రినా కంటే విక్కీ ఐదేళ్లు చిన్నవాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని