‘లాల్‌ సింగ్‌...’లో మా ‘జె’ భాగమే!

ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’. ఇందులో కరీనా కపూర్‌    నాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన కొంత చిత్రీకరణ పూర్తయ్యాకా...

Published : 19 Aug 2021 12:15 IST

ముంబయి: ఆమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌ సింగ్‌ ఛద్దా’. ఇందులో కరీనా కపూర్‌ నాయికగా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కొంత పూర్తయ్యాకా కరీనా రెండోసారి గర్భం దాల్చింది. అప్పటికే కరోనా విలయతాండవం చేస్తోంది. కొన్ని రోజులు ఆగాకా ఆగమేఘాలపై కరీనాకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసింది చిత్రబృందం. మరింత ఆలస్యమైతే కరీనాకు డెలివరీ సమయం దగ్గర పడుతుంది కాబట్టి ఆమె నటించడం కష్టం అనే ఉద్దేశంతో వేగంగా ఆమె కనిపించే సీన్స్‌ను పూర్తి చేశారు. ప్రెగ్నెన్సీ, దానికితోడు కరోనా పరిస్థితులు కారణంగా డాక్టర్‌ వద్దన్నా ఆమె షూటింగ్‌కు హాజరైంది. ఆ సమయంలో తన అనుభవాలను కరీనా వివరించింది. ‘‘లాల్‌ సింగ్‌..’ చిత్రీకరణ కోసం పటౌడీలో ఉంటూ రోజూ దిల్లీ వెళ్లి వచ్చేదాన్ని. రాత్రిళ్లు చిత్రీకరణ కారణంగా ఉదయం నిద్రపోయేదాన్ని. నా భర్త సైఫ్‌ అలీఖాన్‌ మాతో పాటు పటౌడీలోనే ఉంటూ మా పెద్ద అబ్బాయి తైమూర్‌ బాగోగుల్ని దగ్గరుండి చూసుకునేవారు. అంతే కాదు ఈ షెడ్యూల్‌ నాకు ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ సమయంలో మా రెండో అబ్బాయి ‘జె’ నా కడుపులోనే ఉన్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఆమిర్, నేను కలిసి నటించిన ఆ రొమాంటిక్‌ గీతంలో వాడు భాగమే’’అని చెప్పింది కరీనా. ఇందులోని ఓ కీలక పాత్రలో తెలుగు హీరో నాగచైతన్య నటిస్తున్నాడు. ఇటీవలే ఇందులోని కొన్ని సన్నివేశాలను తూర్పుగోదావరి జిల్లాలో చిత్రీకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని