Viruman: కార్తి చిత్రం పూర్తి

తమిళ కథానాయకుడు కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విరుమన్‌’. ముత్తయ్య   దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు శంకర్‌ తనయ అదితి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సూర్య సొంత ...

Updated : 23 Dec 2021 07:05 IST

తమిళ కథానాయకుడు కార్తి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విరుమన్‌’. ముత్తయ్య   దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు శంకర్‌ తనయ అదితి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా దీని చిత్రీకరణ పూర్తయినట్లు చిత్రబృందం ట్విటర్‌ ద్వారా   వెల్లడించింది. గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్‌ కథా చిత్రమిది. ‘మరుత్తు’, ‘కొంబన్‌’ చిత్రాలతో విజయాలు అందుకున్న ముత్తయ్య నుంచి వస్తోన్న ఈ సినిమాపై మంచి   అంచనాలే ఉన్నాయి. దీన్ని తెలుగులోనూ విడుదల చేయాలని యోచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని