Cinema News:చిరు సినిమా టికెట్‌ కోసం పోరాటం చేసిన దర్శకుడు

సమాజంలోని కులవ్యవస్థ, దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి కథాంశంతో వచ్చిన ‘పలాస 1978’తో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు కరుణకుమార్‌. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ....

Updated : 26 Aug 2021 13:46 IST

భావోద్వేగంతో లేఖ రాసిన కరుణకుమార్‌

హైదరాబాద్‌: సమాజంలోని కులవ్యవస్థ, దానివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటి కథాంశంతో వచ్చిన ‘పలాస 1978’తో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు కరుణకుమార్‌. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. సుధీర్‌బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై తనకున్న మక్కువను తెలియజేస్తూ కరుణకుమార్‌ ఓ లేఖను నెట్టింట్లో షేర్‌ చేశారు. తన స్వగ్రామంలోని శ్రీ వేంకటేశ్వర థియేటర్‌లో నేలటిక్కెట్టు రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి అంటే తనకెంతో అభిమానమని.. ఆయన సినిమా చూడడం కోసం టికెట్‌ కౌంటర్‌ వద్ద చిన్న యుద్ధం చేసినట్లు ఉండేదని ఆయన అన్నారు. టికెట్లు సాధించే క్రమంలో దెబ్బ తగిలి రక్తం కారుతున్నా సరే లెక్కచేయకుండా చిరంజీవి సినిమా చూసినట్లు వివరించారు. ఇప్పుడే అదే థియేటర్‌ వద్ద తాను దర్శకత్వం వహించిన ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ కటౌట్‌ ఏర్పాటు చేశారని.. అది చూస్తే ఎన్నో మధుర జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని ఆయన అన్నారు. నేల టిక్కెట్టులో కూర్చొని ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ చూస్తే వచ్చే ఆ కిక్కేవేరు అని ఆయన వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని