Katari Krishna: కఠారి పోరాటం

సీనియర్‌ నటుడు గౌతమ్‌రాజు అబ్బాయి కృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కఠారి కృష్ణ’. ప్రకాష్‌ తిరుమలశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నాగరాజు తిరుమల శెట్టి, పి.ఎ.నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న

Updated : 27 Nov 2021 07:55 IST

సీనియర్‌ నటుడు గౌతమ్‌రాజు అబ్బాయి కృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కఠారి కృష్ణ’. ప్రకాష్‌ తిరుమలశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. నాగరాజు తిరుమల శెట్టి, పి.ఎ.నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవలే ప్రముఖ నటుడు మురళీమోహన్‌ విడుదల చేశారు. ‘‘అడుగడుగునా ఆసక్తి రేకెత్తించే కథ, కథనాలతో కూడిన చిత్రమిది. కఠారి కృష్ణ పోరాటం ఎవరి కోసం అనేది తెరపై చూడాలి. మురళీమోహన్‌, మంచు విష్ణు, తనికెళ్ల భరణి, రామ్‌ లక్ష్మణ్‌ తదితరులు విడుదల చేసిన ప్రచార చిత్రాలకి, ట్రైలర్‌కి చక్కటి స్పందన లభిస్తోంది. చిత్రం కూడా తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. చాణక్య, రేఖా నిరోషా, యష్నా చౌదరి, స్వాతి మండల్‌, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: పద్మనాభవ్‌ భరద్వాజ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని