Cinema News: వచ్చే క్రిస్మస్‌కు ‘మెర్రీ క్రిస్మస్‌’

కొత్త పెళ్లి కూతురు కత్రినాకైఫ్‌ తిరిగి సెట్లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో విజయ్‌సేతుపతితో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ‘మెర్రీ క్రిస్మస్‌’. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. క్రిస్మస్‌ సందర్భంగా ఇటీవల ఈ సినిమా విడుదల...

Updated : 27 Dec 2021 07:03 IST

కొత్త పెళ్లి కూతురు కత్రినాకైఫ్‌ తిరిగి సెట్లోకి అడుగు పెట్టింది. బాలీవుడ్‌లో విజయ్‌సేతుపతితో కలిసి ఆమె నటిస్తున్న చిత్రం ‘మెర్రీ క్రిస్మస్‌’. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే మొదలైంది. క్రిస్మస్‌ సందర్భంగా ఇటీవల ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈచిత్రాన్ని రమేష్‌ తరుణి, సంజయ్‌ రౌట్రే నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని