KatrinaKaif: పెళ్లికి రండి.. కానీ, వాటిని తీసుకురాకండి..!
బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రినాకైఫ్, విక్కీకౌశల్ మరి కొన్నిరోజుల్లో దంపతులు కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ ఆరంభంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంలోకి..
ముంబయి: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ కత్రినాకైఫ్, విక్కీకౌశల్ మరి కొన్నిరోజుల్లో దంపతులు కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ ఆరంభంలో వీరిద్దరూ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టనున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఇరువురు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ పెళ్లికి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి 9 వరకూ జరగనున్న వీరి వివాహానికి రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ వేదిక కానుందట. తమ జీవితాల్లో ఎంతో కీలకమైన ఈ రోజుని కేవలం కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే జరుపుకోవాలని వీరిద్దరూ భావించారట.
అందుకే ఫ్రెండ్స్‌కి మాత్రమే వెడ్డింగ్ కార్డులు అందించారట. అంతేకాకుండా, పెళ్లి ఫొటోలు, వీడియోలు బయటకు లీక్ కావడం తమకు ఇష్టం లేదని.. అందుచేత పెళ్లికి ఎవ్వరూ ఫోన్లు తీసుకురావొద్దని వారు కోరినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌ని ఏర్పాటు చేస్తోన్న ఆర్గనైజర్స్‌కి సైతం ఈ విషయంపై రూల్ పాస్ చేశారట. మరోవైపు, శుభకార్యం దగ్గరపడుతోన్న తరుణంలో ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ జంట గత కొన్నిరోజుల నుంచి పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా పాల్గొంటున్నారట. పెళ్లి దుస్తులు, ఆభరణాల సెలక్షన్, అతిథుల కోసం ఇచ్చే విందు... ఇలా అన్ని విషయాలు దగ్గరుండి గమనిస్తున్నారని బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్‌లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్‌గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
-
20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
-
ఇరాన్లో భారీ పేలుళ్లు.. అన్నంత పని చేసిన ఇజ్రాయెల్!