Katrina-Vicky: అట్టహాసంగా కత్రినా, విక్కీ వివాహం

బాలీవుడ్‌ నటులు కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు గురువారం వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

Updated : 09 Dec 2021 22:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటులు కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు గురువారం వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌లోని సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ ఈ వేడుకకి వేదికైంది. సామాజిక మాధ్యమాల వేదికగా విక్కీ కౌశల్‌ పెళ్లి ఫొటోలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తమ కొత్త ప్రయాణానికి అందరి ప్రేమ, ఆశీస్సులు కావాలని కోరారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. వీరి వివాహ చిత్రాలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని