
KatrinaKaif: కత్రినా పెళ్లికి.. ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే..!
ముంబయి: బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ నటుడు విక్కీ కౌశల్ మరో వారం రోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు. అతి తక్కువ మంది కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో డిసెంబర్ 7 నుంచి 9 వరకూ ఈ పెళ్లి వేడుకలు జరగనున్నాయంటూ గత కొన్నిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కత్రినా-విక్కీ పెళ్లిపై ఓ ఆసక్తికరమైన అంశం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వధూవరులు పెట్టిన కొన్ని రూల్స్‌పై అతిథులు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇంతకీ అతిథుల్ని ఇబ్బందిపెట్టేలా వాళ్లిద్దరూ పెట్టిన రూల్స్ ఏమిటంటే..
1.పెళ్లి వివరాలను ఎవరికీ చెప్పకూడదు.
2.ఫొటోలు, సెల్ఫీలకు అస్సలు అనుమతి లేదు.
3.సోషల్‌మీడియా ఫొటోలు షేర్ చేయకూడదు.
4.వెడ్డింగ్ లొకేషన్ సైతం ఇతరులతో పంచుకోకూడదు.
5.ఒక్కసారి వివాహ వేదికలోకి అడుగుపెట్టాక.. అక్కడి నుంచి వెళ్లేవరకూ బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు ఉండకూడదు.
6.వెడ్డింగ్ ప్లానర్స్ అనుమతి పొందిన తర్వాతనే ఫొటోలు బయటకు వెళ్లాలి.
7.వివాహ వేదిక వద్ద ఎలాంటి రీల్స్, వీడియోలు తీయకూడదు.
పైన పేర్కొన్న విధంగా విక్కీ-కత్రినా అతిథులకు రూల్స్ పాస్ చేశారని.. దానివల్ల గెస్టులందరూ కాస్త అసంతృప్తి గురవుతున్నారని బీటౌన్ కోడైకూస్తోంది. జీవితంలో మధురఘట్టంగా చెప్పుకునే పెళ్లిని కుటుంబసభ్యుల సమక్షంలో సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్లు రూల్స్ పెట్టారని అందరూ చెప్పుకుంటున్నారు. మరోవైపు, పెళ్లికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉన్నప్పటికీ విక్కీ-కత్రినా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.