Khiladi: ‘ఖిలాడి’ విడుదల ఖరారు

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఖిలాడి’. ప్లే స్మార్ట్‌... అనేది ఉపశీర్షిక. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలు. రమేష్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు

Updated : 12 Nov 2021 07:34 IST

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఖిలాడి’. ప్లే స్మార్ట్‌... అనేది ఉపశీర్షిక. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి కథానాయికలు. రమేష్‌వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. చిత్రీకరణకి తుదిదశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఆ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. చక్కటి వినోదాన్ని పంచుతుంది. రవితేజ విభిన్నమైన పాత్రని పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వర పరిచిన రెండు పాటలు ఇప్పటికే విడుదలై చక్కటి ఆదరణని సొంతం చేసుకున్నాయి. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి. అర్జున్‌, ఉన్ని ముకుందన్‌, అనసూయ భరద్వాజ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌, జీకే విష్ణు, సమర్పణ: జయంతిలాల్‌ గడ.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని