Tollywood: ఆకట్టుకునేలా ‘సమ్మతమే’ ఫస్ట్‌లుక్‌

కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి నాయిక. గోపీనాథ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు కిరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం.

Published : 15 Jul 2021 16:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సమ్మతమే’. చాందిని చౌదరి నాయిక. గోపీనాథ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు కిరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో ఓ ఇంటి ముందు కూర్చుని అద్దంలో తన అందాన్ని చూసి మురిసిపోతుంటాడు హీరో. పక్కనే ఉన్న నాయిక ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు చిందిస్తూ కనిపించింది. నల్ల చొక్కా, గళ్ల లుంగీ ధరించిన కిరణ్‌, నీలం చీరలో దర్శనమిచ్చిన చాందిని.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. పోస్టర్‌లో పల్లెటూరి వాతావరణం ఉట్టిపడుతోంది. మరి ఈ ఇద్దరి ప్రేమకథని చూడాలంటే కొంతకాలం ఆగాల్సిందే. కె. ప్రవీణ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

5వ చిత్రం ఖరారు..

పుట్టిన రోజుని పురస్కరించుకుని తన 5వ చిత్రాన్ని ప్రకటించాడు కిరణ్‌ అబ్బవరం. కార్తీక్‌ శంకర్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు దివంగత కోడి రామకృష్ణ తనయ కోడి దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టైటిల్‌, నాయిక వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. కిరణ్‌ నటించిన ‘ఎస్‌.ఆర్‌. కల్యాణ మండపం’ చిత్రం ఆగస్టు 6 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని