RGV: తల్వార్‌తో రామ్‌గోపాల్‌ వర్మ హల్‌చల్‌

అదిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. వరంగల్‌లోని కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది....

Updated : 26 Dec 2021 15:46 IST

హైదరాబాద్‌: అదిత్‌ అరుణ్‌, ఇర్రా మోర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండా’. వరంగల్‌లోని కొండా మురళి, సురేఖ దంపతుల జీవితకథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యింది. హనుమకొండలో ఆఖరి షెడ్యూల్‌ పూర్తైన వెంటనే చిత్రబృందం ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసింది. కొండా దంపతులు పాల్గొన్న ఈ పార్టీలో రామ్‌గోపాల్‌ వర్మ హంగామా చేశారు. తల్వార్‌తో కేక్‌ కట్‌ చేసి హల్‌చల్‌ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను ట్విటర్‌ వేదికగా ఆయన షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని