Bangarraju: నాగార్జున ప్రశ్నకు చైతన్య సమాధానమిదే..!

2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో బంగార్రాజుగా ప్రేక్షకుల్ని అలరించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు మరలా అదే పాత్రతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’....

Published : 18 Nov 2021 12:20 IST

హైదరాబాద్‌: 2016లో విడుదలైన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రంతో బంగార్రాజుగా ప్రేక్షకుల్ని అలరించిన అక్కినేని నాగార్జున ఇప్పుడు మరోసారి అదే పాత్రతో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. ఇందులో నాగార్జునతోపాటు ఆయన తనయడు నాగచైతన్య సైతం సందడి చేయనున్నారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ, చైతన్యకు జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు.

కాగా, తాజాగా ఈ సినిమా నుంచి కృతిశెట్టి ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఇందులో ఆమె నాగలక్ష్మిగా కనిపించనున్నారు. కృతిశెట్టి ఫస్ట్‌లుక్‌ విడుదల విషయాన్ని తెలియజేస్తూ ఇటీవల నాగచైతన్య ఓ ట్వీట్‌ చేయగా.. ‘‘అంతా బాగానే ఉంది. మరి బంగార్రాజు మాటేమిటి?’’ అని నాగార్జున ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు తాజాగా చైతన్య రిప్లై ఇచ్చారు. తన తండ్రిని ట్యాగ్‌ చేస్తూ.. ‘‘బంగార్రాజు త్వరలోనే వస్తున్నాడు. లేడీస్‌ ఫస్ట్‌. అందుకే మా నాగలక్ష్మి ఫస్ట్‌లుక్ షేర్‌ చేస్తున్నాం’’ అని చైతన్య పేర్కొన్నారు. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని