చేనేత గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రమిది: కేటీఆర్‌

 చేనేత, చేతి వృత్తుల్లో ఎన్నో ఆవిష్కరణలు రావాలని, ఇందుకు ‘తమసోమా జ్యోతిర్గమయ’లాంటి చిత్రాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.

Updated : 13 Oct 2021 20:59 IST

హైదరాబాద్‌: చేనేత వృత్తిలో ఎన్నో ఆవిష్కరణలు రావాలని, ఇందుకు ‘తమసోమా జ్యోతిర్గమయ’లాంటి చిత్రాలు దోహదపడతాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించి, మాట్లాడారు. ‘ఈ చిత్రం చేనేత వృత్తిలోని కష్టాలు, కన్నీళ్లనే మాత్రమే కాదు చేనేత గొప్పదనాన్ని చాటిచెబుతుంది. యువత ఈ రంగంవైపు అడుగేసేలా చేస్తుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు. ఆనంద్‌రాజ్‌, శ్రామణిశెట్టి జంటగా నటించిన చిత్రమిది. భూదాన్‌ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్‌ కుమార్‌ దర్శకత్వం వహించారు. విమల్‌ క్రియేషన్స్‌ పతాకంపై తడక రమేశ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకురానుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని