Yash: అప్పుడు షారుఖ్‌తో.. ఇప్పుడు అమిర్‌తో..!

‘సూర్యవంశీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు సైతం థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బీటౌన్‌ స్టార్స్‌ చిత్రాల రిలీజ్‌లపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది.....

Published : 21 Nov 2021 16:09 IST

పోటీపడుతోన్న సౌత్‌ స్టార్‌ హీరో

హైదరాబాద్‌: ‘సూర్యవంశీ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో బాలీవుడ్‌ దర్శకనిర్మాతలు సైతం థియేటర్లలో సినిమాలు విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో బీటౌన్‌ స్టార్స్‌ చిత్రాల రిలీజ్‌లపై ఇప్పుడిప్పుడే ఓ క్లారిటీ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ని వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం శనివారం అధికారికంగా ప్రకటించింది. అదే రోజున యశ్‌ నటించిన ‘కేజీఎఫ్‌-2’ కూడా విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో ‘కేజీఎఫ్‌-2’, ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమాలపై నెట్టింట్లో చర్చ జరుగుతోంది. మా హీరో సినిమా విజయం సాధిస్తుందంటే.. మా హీరో సినిమానే బాక్సాఫీస్‌ రికార్డులు సొంతం చేసుకుంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరికొందరు నెటిజన్లు.. ‘‘కేజీఎఫ్‌-1’ సినిమా విడుదలైనప్పుడే షారుఖ్‌ నటించిన ‘జీరో’ రిలీజైంది. ఇప్పుడు మళ్లీ ‘కేజీఎఫ్‌-2’ టైమ్‌లో అమిర్‌ఖాన్‌ నటించిన ‘లాల్‌సింగ్‌ చద్దా’ వస్తోంది. యశ్‌ తన సినిమాలతో బాలీవుడ్‌ మార్కెట్‌లోనూ మంచి పోటీ ఇస్తున్నాడు’’ అని చెప్పుకొంటున్నారు.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘కేజీఎఫ్‌-2’ చిత్రానికి ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో యశ్‌ రాఖీ బాయ్‌ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌, నటి రవీనా టాండన్‌, రావు రమేశ్‌ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మరోవైపు 2018లో విడుదలైన ‘కేజీఎఫ్‌’ సీక్వెల్‌గా ‘కేజీఎఫ్‌-2’ తెరకెక్కిన విషయం తెలిసిందే.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు