
Nayanthara: నా నిశ్చితార్థమైపోయింది.. రింగ్ చూపించిన లేడీ సూపర్‌స్టార్
రూల్స్ బ్రేక్ చేసి.. చాలా సంవత్సరాల తర్వాత..!
హైదరాబాద్: దక్షిణాది లేడీ సూపర్‌స్టార్ నయనతార - కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ జంట పెళ్లి వార్త కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నయన్-విఘ్నేశ్ నిశ్చితార్థం, పెళ్లి గురించి ఎన్నో సందర్భాల్లో వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. కానీ, ఈ జంట మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
తాజాగా ‘నెత్రికన్’ సినీ ప్రమోషన్‌లో భాగంగా నయన్ చాలా రోజుల తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ ప్రోమో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అందులో నయన్.. తనకు నిశ్చితార్థమైనట్లు చెప్పి, ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపించారు. విఘ్నేశ్ ఎంతో మంచి వ్యక్తి అని.. ఆయనతో ఉంటే ఎప్పుడూ ఆనందమే ఉంటుందని వివరించారు. నయన్ చెప్పిన శుభవార్తతో ఆమె అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సాధారణంగా నయన్ సినిమా ప్రమోషన్స్‌కి దూరంగా ఉంటారు. తాజాగా ‘నెత్రికన్’ ప్రమోషన్‌లో పాల్గొనడం విశేషం.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘నెత్రికన్’. నయన్ ప్రధాన పాత్రలో నటించిన ఈసినిమాలో అజ్మల్ ప్రతి నాయకుడిగా కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆమె అంధురాలిగా కనిపించనున్నారు. మిలింద్ రావు దర్శకత్వం వహించారు. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్ వేదికగా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.