Lakshya: లక్ష్య ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

‘వరుడు కావలెను’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘లక్ష్య’.  ఫ్యామిలీ, లవ్‌ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన శౌర్య..

Updated : 07 Dec 2022 16:20 IST

హైదరాబాద్‌: ‘వరుడు కావలెను’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నాగశౌర్య హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘లక్ష్య’.  ఫ్యామిలీ, లవ్‌ ఎంటర్‌టైనర్లతో ప్రేక్షకులను అలరించిన శౌర్య.. ఈ సినిమా ద్వారా మొదటిసారి స్పోర్ట్స్‌ డ్రామాలో నటిస్తున్నారు. ఆర్చరీ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ‘లక్ష్య’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ‘అరచేతుల్లో దాచి వెలిగించే దీపం తానే’ అంటూ సాగే ఈ పాట మనసుని హత్తుకునేలా ఉంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ సినిమాలో జగపతిబాబు.. నాగశౌర్య తండ్రి పాత్ర పోషించారు. శౌర్యకు జోడీగా కేతికాశర్మ నటించారు. కాలభైరవ స్వరాలు సమకూర్చారు. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, రామ్మోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని