Lakshya: ట్రైలర్‌ ఆ రోజే

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌  జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పుస్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌

Updated : 29 Nov 2021 10:25 IST

నాగశౌర్య కథానాయకుడిగా నటించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. సంతోష్‌  జాగర్లపూడి దర్శకుడు. నారాయణ్‌ దాస్‌ కే నారంగ్‌, పుస్కర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు, సచిన్‌ ఖేద్కర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా డిసెంబర్‌ 1న చిత్ర ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సామాజిక మాధ్యమాల్లో కొత్త పోస్టర్‌ పంచుకున్నారు. ఆ పోస్టర్‌లో శౌర్య గాయపడిన చేత్తోనే కఠిన కసరత్తులు చేస్తూ కనిపించాడు. విలువిద్య నేపథ్య కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం విలు విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకోవడంతో పాటు తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు నాగశౌర్య. సంగీతం: కాల భైరవ, కూర్పు: జునైద్‌, ఛాయాగ్రహణం: రామ్‌ రెడ్డి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని