Nithiin: ‘మాస్ట్రో’ కొత్త పాట వినిపించాడు!

‘మాస్ట్రో’ సినిమా నుంచి కొత్త పాట విడుదలైంది. నితిన్, నభా నటేశ్‌, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు.

Published : 06 Sep 2021 20:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబరు 17 నుంచి ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పాటలు విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘హార్టేమో కొట్టుకుంది గోడకి’ అనే గీతాన్ని విడుదల చేసింది. కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించిన ఈ పాటని ధనుంజయ్‌ సీపాన ఆలపించారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. కథానాయకుడి పరిస్థితిని తెలియజేస్తోన్న ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ నాయిక తమన్నా కీలక పాత్రలో పోషించింది. హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ రీమేక్‌గా ‘మాస్ట్రో’ రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని