Bigg Boss Telugu 5: షణ్ణూ.. సలహాలివ్వడం తగ్గించుకుంటే మంచిది: సిరి
బిగ్‌బాస్ హౌస్‌లో ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ పేరుతో నిర్వహించిన కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న .....
హైదరాబాద్: బిగ్‌బాస్ హౌస్‌లో ‘బీబీ బొమ్మల ఫ్యాక్టరీ’ పేరుతో నిర్వహించిన కెప్టెన్సీ టాస్క్ ముగిసింది. ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఊహించని షాక్ ఇచ్చాడు. హౌస్‌లో ఉన్న కుషన్స్‌ని చించి బొమ్మలు తయారు చేసిన రవి టీమ్ పోటీ నుంచి డిస్క్వాలిఫై అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. సంచాలకులుగా వ్యవహరించిన కాజల్, సిరిలను కూడా కెప్టెన్ అయ్యేందుకు అర్హత లేదని చెప్పడంతో వాళ్లిద్దరూ బాధపడ్డారు. స్పెషల్ పవర్‌తో శ్రీరామ్ టీమ్.. షణ్ముఖ్ టీమ్ వద్ద ఉన్న బొమ్మలను సగం తీసేసుకుంది. దీంతో కెప్టెన్ పోటీదారులుగా బ్లూ టీమ్ సభ్యులైన సన్నీ, మానస్, అనీ మాస్టర్.. రెడ్ టీమ్ సభ్యులైన ప్రియ, విశ్వ, శ్రీరామ్‌లు పోటీలో నిలిచారు. వీరికి హర్డిల్స్ దాటుకుని ఇసుక నింపే టాస్క్ ఇవ్వగా.. అందులో విశ్వ విజయం సాధించి హౌస్‌లో కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అనంతరం కాజల్ మానస్‌ల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘ఇంట్లో ముగ్గురు వ్యక్తులు నీ కోసం కొట్టుకుంటున్నారు’ అని కాజల్ చెప్పగా... ‘ఎవరా ముగ్గురు..?’ అని మానస్ అడిగాడు. ‘ఆ విషయం నేను చెప్పను’ అని కాజల్ అనగా.. ‘ప్రియాంక, కాజల్‌లు నా కోసం కొట్టుకుంటున్నారా?’ అని అడిగాడు. ప్రియ కూడా నీ విషయంలో కేర్ తీసుకుంటారు అని కాజల్ చెప్పింది. (గతంలో ఒకానొక సమయంలో మానస్ తనకు కొడుకులాంటి వాడు అని ప్రియ చెప్పిన విషయం తెలిసిందే). అనంతరం, రేషన్ మేనేజర్ ఎంపికపై బిగ్‌బాస్ చిన్న టాస్క్ ఇచ్చాడు. అందులో సన్నీ, ప్రియాంక, మానస్ పోటీ పడ్డారు. సరదాగా సాగిన ఈ టాస్క్‌లో మానస్.. ప్రియాంకను గెలిపించాడు.
సిరిని బతిమలాడిన షణ్ముఖ్
కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా.. ‘అందరితో నవ్వుతూ ఉంటే నువ్వు ఓడిపోతావ్’ అని జెస్సీ ప్రియాంకతో అన్నాడు. ధైర్యంగా పోరాడాలని సూచించాడు. ఆ తర్వాత షణ్ముఖ్, సిరి, జెస్సీల మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. ‘ఉచిత సలహాలు ఇవ్వకు’ అంటూ షణ్ముఖ్.. జెస్సీకి బోధించాడు. అక్కడే ఉన్న సిరి.. ‘నువ్వు కూడా సలహాలు ఇవ్వడం తగ్గించుకుంటే బాగుంటుంది’ అని షణ్ముఖ్‌ని అంది. ‘అన్నింటిలో ఎందుకు కలుగచేసుకుంటున్నావ్..’ అంటూ సిరిపై షణ్ము ఫైర్ అయ్యాడు. దీంతో కోపం తెచ్చుకున్న సిరి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటి తర్వాత షణ్ముఖ్ వెళ్లి సిరిని బతిమలాడు.
మానస్‌కు బొట్టు పెట్టిన ప్రియాంక
హౌస్‌లో అందరూ నిద్రపోయిన తర్వాత మానస్ దగ్గరకు వెళ్లిన ప్రియాంక.. అతని ముఖంపై ఉన్న దుప్పటి తీసి బొట్టు పెట్టింది. ఈ సందర్భంగా సిరి, ప్రియ, శ్వేత, ప్రియాంకల మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. ‘మానస్ బాగుంటాడు కదా’ అని సిరి.. ప్రియాంకను ఉడికించగా.. ‘నీ దిష్టే తగిలేలా ఉంది’ అని ప్రియాంక అనడంతో నవ్వులు పూస్తాయి. అలా, కాసేపు వాళ్లందరి మధ్య మానస్ గురించి చర్చ జరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
రాఖీభాయ్ లుక్‌లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్‌తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
రామ్‌చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్‌తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్‌లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్‌చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్‌చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!