NBK 107: అమెరికా నేపథ్యంలో...

బాలకృష్ణ సినిమాల కథలు విదేశీ నేపథ్యంలో సాగడం అరుదు. ఆయన కొత్త సినిమా అమెరికాతో ముడిపడిన కథతో తెరకెక్కనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఇటీవల ఆరంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ

Updated : 18 Nov 2021 07:21 IST

బాలకృష్ణ సినిమాల కథలు విదేశీ నేపథ్యంలో సాగడం అరుదు. ఆయన కొత్త సినిమా అమెరికాతో ముడిపడిన కథతో తెరకెక్కనుంది. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఇటీవల ఆరంభమైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ కలిసి నిర్మిస్తున్నారు. జనవరి నుంచి చిత్రీకరణ షురూ కానుంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. బాలకృష్ణని రెండు కోణాల్లో సాగే పాత్రలో చూపించనున్నారు. వాస్తవ సంఘటనలు, అమెరికా నేపథ్యంలో సాగే కథ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఛాయాగ్రహణం: రిషి పంజాబీ, కూర్పు: నవీన్‌ నూలి, సంగీతం: తమన్‌, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని