Dhee 14: ఢీ 14 ప్రోమో.. ఒకే టికెట్‌పై నాలుగు సినిమాలు

అతిపెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షోగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘ఢీ’ షో సరికొత్త సీజన్‌ ప్రారంభమైంది. ‘ఢీ14 ది డ్యాన్సింగ్‌ ఐకాన్‌’ అనే టైటిల్‌తో....

Published : 11 Dec 2021 18:55 IST

హైదరాబాద్‌: అతిపెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షోగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘ఢీ’ షో సరికొత్త సీజన్‌ ప్రారంభమైంది. ‘ఢీ14 ది డ్యాన్సింగ్‌ ఐకాన్‌’ టైటిల్‌తో ఈ సీజన్‌ ప్రేక్షకులను అలరించనుంది. డిసెంబర్‌ 15 నుంచి ప్రారంభం కానుంది. ప్రదీప్‌ వ్యాఖ్యాతగా.. ప్రియమణి, గణేశ్‌ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్న ఈ షో ప్రోమో తాజాగా విడుదలైంది. హైపర్‌ ఆది, అఖిల్‌ టీమ్‌ లీడర్లుగా కనిపించనున్నారు. ఈసారి జూనియర్స్, లేడీస్‌, జోడీ, ఛాంపియన్స్‌.. ఇలా నాలుగు విభాగాల్లో కంటెస్టెంట్స్ తలపడనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని