
Bigg Boss Telugu 5: నా పెర్ఫామెన్స్ నచ్చిందా? గంటెందుకు కొట్టడం లేదు: సన్నీ
హైదరాబాద్: ‘‘నువ్వు ఏం నిరూపించడానికి గేమ్ ఆడతావో నాకు అర్థమే కాదు. నీకన్నా అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలీదు. ఒక్కడ్ని విలన్ చేయడానికి ఫస్ట్ కూర్చుంటావ్’’ అంటూ సిరిపై తనకున్న అసహనాన్ని సన్నీ వ్యక్తం చేశాడు. గత కొన్నిరోజులుగా బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్ సీజన్-5’ తుది దశకు చేరుకుంటోంది. దీంతో ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్-7 కంటెస్టెంట్స్ మధ్య పోరు మరింత హోరాహోరీగా మారింది. ‘టికెట్ టు ఫినాలే’ కోసం ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ పోటీ పెట్టారు. హౌస్‌మేట్స్ ఐస్ టబ్‌లో కాళ్లు పెట్టుకొని ఉండాలని, కాళ్లు బయట పెట్టినప్పుడు ఇతర ఇంటిసభ్యులు అతని సమీపంలోని బాల్స్‌లో ఒకదాన్ని తీసుకుని వారి టబ్‌లో వేసుకోవాలని సూచించాడు. ఈ టాస్క్ తొలుత సరదా సాగింది. ఇక రెండో లెవల్‌లో సన్నీ, షణ్మఖ్‌లు తమ స్థానాలను మార్చుకున్నారు. దీంతో, సిరి పక్కనే సన్నీ రావడంతో.. అతని వద్ద నుంచి ఓ బాల్‌ని ఆమె దొంగిలించింది. ఈ క్రమంలో సిరి-సన్నీ మధ్య వాగ్వాదం చోటుచేసుకొంది. ‘హలో హలో.. నా కాలు ఇంకా టబ్‌లోనే ఉంది. మీరేలా నా బాల్ తీసుకుంటారు’ అని సన్నీ అడగ్గా.. ‘‘లేదు సన్నీ.. నీ కాలు టబ్‌లో లేనప్పుడే నేను బాల్ తీసుకున్నాను’’ అని సిరి సమాధానమిచ్చింది. దీంతో ఆగ్రహానికిలోనైన సన్నీ.. ‘ఆడండి.. మీరే ఆడండి. నేను కూడా నా ఆట చూపిస్తా’’ అంటూ కేకలు వేశాడు. మరి ఈ పోటీలో ఎవరు విజయం సాధిస్తారో? ఫినాలేకి టికెట్ ఎవరు పొందుతారో? తెలియాల్సి ఉంది.