Bigg Boss 5: బాలయ్యగా సన్నీ.. అతిలోక సుందరిగా కాజల్‌.. అదరగొట్టేశారు

ఓటు అప్పీల్‌ చేసే అర్హత గెలుచుకోవడానికి ఇంటిసభ్యులందరూ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్‌కి మూడో అవకాశంలో భాగంగా బిగ్‌బాస్‌...

Published : 09 Dec 2021 14:02 IST

హైదరాబాద్: ఓటు అప్పీల్‌ చేసే అర్హత గెలుచుకోవడానికి ఇంటిసభ్యులందరూ ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్‌కి మూడో అవకాశంలో భాగంగా బిగ్‌బాస్‌ ఓ స్పెషల్‌ టాస్క్‌ ఇచ్చాడు. పలువురు ప్రముఖ సినీతారల రోల్‌ ప్లే చేయాలని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో సన్నీ బాలకృష్ణ గెటప్‌ ధరించి.. ఆయనలా మాట్లాడి నవ్వులు పూయించారు. ఇక, అతిలోక సుందరిగా కాజల్‌, జెనీలియాగా సిరి, గబ్బర్‌సింగ్‌ పాత్రలో మానస్‌, ‘తమ్ముడు’లో పవన్‌లా శ్రీరామ్‌ గెటప్స్‌ ధరించి తమ నటనతో మెప్పించారు. మధ్యమధ్యలో పలు పాటలకు డ్యాన్స్‌లు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని