AlluArjun: పదేళ్లు.. పది సీజన్లు.. ఐకాన్‌స్టార్‌ ఎంట్రీ అదుర్స్‌

దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ’ సీజన్‌ 13 తుది అంకానికి చేరుకుంది. కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది...

Updated : 26 Nov 2021 12:06 IST

హైదరాబాద్‌: దక్షిణాదిలోనే అతిపెద్ద డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ’ సీజన్‌ 13 తుది అంకానికి చేరుకుంది. కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్‌ ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరించింది. అతి త్వరలో ఈ డ్యాన్స్‌ షో గ్రాండ్‌ఫినాలే మరింత గ్రాండ్‌ లెవల్‌లో జరగనుంది. ఈ వేడుకకు ఐకాన్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ మేరకు అల్లు అర్జున్‌ ఎంట్రీకి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమోని ‘ఢీ’ టీమ్‌ తాజాగా విడుదల చేసింది.

‘పుష్ప’ చిత్రంలోని ‘ఏయ్‌ బిడ్డా.. ఇది నా అడ్డా’ పాటతో బన్నీ సూపర్‌ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు, ‘ఆర్య-2’ సమయంలో జరిగిన ‘ఢీ-3’ గ్రాండ్‌ఫినాలేకు బన్నీ-సుకుమార్‌ కలిసి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు  పదేళ్లు, పది సీజన్ల తర్వాత బన్నీ ఈ సీజన్‌కు మళ్లీ గెస్ట్‌గా రావడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు పేర్కొంటున్నారు. ఇక, ‘ఢీ’ విషయానికి వస్తే.. ప్రతి బుధవారం ఈటీవీలో ప్రసారమయ్యే ఈ షోకి ప్రియమణి, గణేశ్‌ మాస్టర్‌, పూర్ణ న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. సుధీర్‌-హైపర్‌ ఆది, రష్మి-దీపిక టీమ్‌ లీడర్లుగా, ప్రదీప్‌ వ్యాఖ్యాతగా అలరిస్తున్నారు. ఎంతో హోరాహోరీగా సాగుతోన్న ఈ షోలో ఎవరు విజయం సాధిస్తారో తెలియాల్సి ఉంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు