
Extra Jabardasth: రష్మిని ఇమిటేట్ చేసిన నరేశ్.. సిగ్గుతో తలదాచుకున్న నటి
హైదరాబాద్: ‘అసలేం గుర్తుకురాదు’ అంటూ రష్మి చేసిన డ్యాన్స్‌ను ఇమిటేట్ చేశారు ‘జబర్దస్త్’ హాస్యనటుడు నరేశ్. నవ్వులు పూయించేలా ఉన్న అతడి డ్యాన్స్ చూసి ఆమె సిగ్గుతో తల దించుకున్నారు. మరోవైపు రోజా సైతం.. ‘నరేశ్.. అమ్మాయి గెటప్‌లో నువ్వు భలే క్యూట్‌గా ఉన్నావు. నీ బుగ్గలు గిల్లాలనిపిస్తోంది’ అంటూ కామెంట్ చేశారు. ఈ సరదా, ఫన్‌ఫుల్ మాటలకు ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వేదికైంది.
రష్మి వ్యాఖ్యాతగా ప్రతి శుక్రవారం ఈటీవీలో ప్రసారమయ్యే కామెడీ షో ‘ఎక్స్ట్రా జబర్దస్త్’. రోజా, మనో న్యాయనిర్ణేతలు. తాజాగా వచ్చే శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రేమ వివాహం కాన్సెప్ట్‌పై కెవ్వు కార్తీక్ ఓ సరదా స్కిట్ చేశారు. ఇందులో భాగంగా కార్తీక్ స్కిట్లో సుడిగాలి సుధీర్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చారు. నరేశ్ లేడీ గెటప్‌లో తనదైన పంచులతో నవ్వులు పూయించారు. ఎప్పటిలానే వరుస ఆటో పంచులతో సుధీర్ స్కిట్ అలరించేలా ఉంది. ‘అన్నా.. ఇటీవల ఓ పెద్దాయన ప్రవచనాలు చెబుతున్న వీడియోలకు మన వాళ్లు నీ గురించి కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి, మన వాళ్లకు కొంచెం చెప్పన్న’ అంటూ భాస్కర్.. సుధీర్‌కి చెప్పారు. వెంటనే రష్మి స్పందిస్తూ.. ‘‘మొన్న నేను కూడా ఓ వీడియో కింద సుధీర్ గురించి ఆయన ఫ్యాన్స్ చేసిన కామెంట్లు చూశాను. ‘మా ఇంట్లో బ్రష్ సుధీర్ అన్న ఫ్రెష్’ అని వాళ్లు కామెంట్ చేశారు’ అంటూ నవ్వులు పూయించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Bhagwant Mann: రెండో వివాహం చేసుకోబోతోన్న సీఎం భగవంత్ మాన్!
-
Movies News
Archana: ‘మగధీర’లో అవకాశాన్ని అలా చేజార్చుకున్నా: అర్చన
-
Sports News
Joe root: కోహ్లీ,స్మిత్‌లను దాటేసిన రూట్
-
World News
Zimbabwe: త్వరలో బంగారు నాణేలు ముద్రించనున్న జింబాబ్వే..!
-
Politics News
Konda Vishweshwar Reddy: నెలకు ఒక్క లీడర్‌నైనా భాజపాలోకి తీసుకొస్తా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
-
World News
Boris Johnson: మరింత సంక్షోభంలో బోరిస్ సర్కారు.. మరో ఇద్దరు మంత్రుల రాజీనామా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య