Lavanya Tripati: లావణ్య.. ‘హ్యాపీ బర్త్‌డే’

‘మత్తు వదలరా’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న దర్శకుడు రితేష్‌ రానా. ఇప్పుడాయన రెండో సినిమాని మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో...

Updated : 16 Dec 2021 07:20 IST

‘మత్తు వదలరా’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్న దర్శకుడు రితేష్‌ రానా. ఇప్పుడాయన రెండో సినిమాని మైత్రీ మూవీస్‌ మేకర్స్‌, క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. బుధవారం లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ప్రచార చిత్రంలో లావణ్య మిషన్‌ గన్‌ పట్టుకుని ఫైరింగ్‌ చేస్తూ కనిపించింది. పోస్టర్‌ బ్యాగ్రౌండ్‌లో ‘నో గన్‌.. నో ఎంట్రీ’ అంటూ ఓ బోర్డును చూపించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాతో రితేష్‌ ప్రేక్షకులకు పసందైన వినోదం అందించనున్నారు. ప్రస్తుతం రెగ్యులర్‌ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది’’ అన్నారు. దీనికి కాల భైరవ స్వరాలందిస్తున్నారు. సురేష్‌ సారంగం ఛాయాగ్రాహకుడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని