
MostEligibleBachelor: లెహరాయి.. అఖిల్-పూజా కెమిస్ట్రీ అదిరిందోయి..!
హైదరాబాద్: కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని సూపర్‌హిట్ అందుకునేందుకు ఎదురుచూస్తున్నారు అఖిల్ అక్కినేని. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ప్రేమకథా చిత్రాలతో అలరిస్తోన్న ఆయన మరోసారి మనసును హత్తుకునే యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని మరికొన్నిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘లెహరాయి’ అంటూ సాగే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రేమగీతంగా రూపుదిద్దుకున్న ఈ పాటలో అఖిల్-పూజాల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది. గోపీసుందర్ స్వరాలు అందించగా సిద్ద్ శ్రీరామ్ ఈ పాట ఆలపించారు. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.