Ranveer Singh: ‘83’ వరల్డ్‌ కప్‌.. భావోద్వేగంగా ‘లెహరా దో’ సాంగ్‌

టీమిండియా మాజీ సారథి, 1983 వరల్డ్‌ కప్‌ విజేత కపిల్‌దేవ్‌ జీవితాన్ని ఆధారంగా రూపొందిన చిత్రం ‘83’. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 06 Dec 2021 22:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ సారథి, 1983 వరల్డ్‌ కప్‌ విజేత కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘83’. రణ్‌వీర్‌ సింగ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా డిసెంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘లెహరా దో’ అనే గీతాన్ని చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. వరల్డ్‌ కప్‌ అందుకునేందుకు ఆనాడు కపిల్‌దేవ్‌, టీమ్‌ ఎంత కష్టపడిందో కళ్లకు కట్టినట్టు ఈ వీడియోలో చూపించారు. ఈ భావోద్వేగ గీతాన్ని కౌసర్‌ మునిర్‌ రచించారు. ప్రీతమ్‌ సంగీతం అందించారు. అర్జిత్‌ సింగ్‌ ఆలపించారు. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌వీర్‌కు జోడీగా దీపికా పదుకొణె నటించారు. తాహీర్‌ రాజ్‌ భాసిన్‌, జీవా తదితరులు కీలకపాత్రలు పోషించారు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమైన ఈ సినిమా హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. 3డీ వెర్షన్‌లోనూ సందడి చేయనుంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని