Liger: ‘లైగర్‌’ ఫైట్‌

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌,

Updated : 01 Jan 2022 09:37 IST

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర తొలి గ్లింప్స్‌ శుక్రవారం విడుదల చేశారు. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. కథాంశానికి తగ్గట్లుగానే ప్రచార చిత్రంలో అదిరిపోయే యాక్షన్‌ హంగామాని చూపించారు. విజయ్‌ పాత్రను ముంబయిలో స్లమ్‌బాయ్‌గా, ఛాయ్‌వాలాగా చూపించి.. ఫైటింగ్‌ రింగ్‌లోకి దించారు. ఆ తర్వాత నుంచి వచ్చిన ప్రతి యాక్షన్‌ సీన్‌ చూపు తిప్పుకోనివ్వకుండా సాగింది. ‘‘వీ ఆర్‌ ఇండియన్స్‌’’, ‘‘వాట్‌ లగా దేంగే’’ అంటూ గ్లింప్స్‌లో విజయ్‌ పలికిన సంభాషణలు శక్తిమంతంగా ఉన్నాయి. ఈ చిత్రం.. ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి స్టంట్‌ డైరెక్టర్‌: కెచ్చా, కూర్పు: జునైద్‌ సిద్దిఖీ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని