Liger: ‘లైగర్’ మంట
మంట పుట్టిద్దాం... అంటూ సందడి చేస్తున్నారు విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కలయికలో ‘లైగర్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విడుదల ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాకి సంబంధించి
మంట పుట్టిద్దాం... అంటూ సందడి చేస్తున్నారు విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్. ఈ ఇద్దరి కలయికలో ‘లైగర్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. విడుదల ఎప్పుడెప్పుడా అని దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ సినిమాకి సంబంధించి రెండు ముఖ్యమైన తేదీల్ని ప్రకటించాయి చిత్రవర్గాలు. ఒకటి సినిమా విడుదల తేదీ కాగా, మరొకటి ప్రచార చిత్రం విడుదల తేదీ. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్ట్ 25న విడుదల కానుంది. ‘అర్జున్‌రెడ్డి’ అదే తేదీనే విడుదలైంది. ఫస్ట్ గ్లిమ్స్ ప్రచార చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి సినీ వర్గాలు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జోడీగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాలా క్రాస్ బ్రీడ్... అనేది ఉపశీర్షిక. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా, ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇతివృత్తంగా... భారతదేశంలోని అతి పెద్ద యాక్షన్ చిత్రంగా రూపొందుతోంది. ఇటీవలే అమెరికాలో నాయకానాయికలు, మైక్ టైసన్ నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరించారు. భారతదేశంలో తెరకెక్కించాల్సిన ఓ చిన్న షెడ్యూల్ మినహా చిత్రీకరణ పూర్తయినట్టు సినీ వర్గాలు తెలిపాయి. ‘‘ఈ కొత్త ఏడాది... మంట పుట్టిద్దాం’’ అంటూ నిర్మాతలు సినిమా, ప్రచార చిత్రాల విడుదల తేదీల్ని ప్రకటించారు. రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విష్ణురెడ్డి, అలీ, మకరంద్ దేశ్‌పాండే, గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, పోరాటాలు: కెచ్చా, కళ: జానీ షేక్ బాషా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
నటుడు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)ను రష్మిక (Rashmika) పార్టీ అడిగారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. -
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్‌రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్‌ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్‌గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్‌గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు