
RGV: పూరీ.. నువ్వు అచ్చం మైక్ టైసన్లానే ఉన్నావ్: ఆర్జీవీ
హైదరాబాద్: దర్శకుడు పూరీ జగన్నాథ్ అచ్చం మైక్ టైసన్లా కఠినంగా ఉన్నాడని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. పూరీ తెరకెక్కిస్తోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైగర్’. విజయ్ దేవరకొండ హీరోగా సిద్ధమవుతోన్న ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఓ పాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సరికొత్త షెడ్యూల్ మంగళవారం లాస్‌వెగాస్‌లో ప్రారంభమైంది. విజయ్-మైక్టైసన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా చిత్రబృందం కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ‘‘మైక్ టైనస్తో షూట్ ఎంతో సరదాగా ఉంది’’ అని టీమ్ పేర్కొంది. ‘లైగర్’ టీమ్ షేర్ చేసిన ఫొటోలపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. ‘‘వన్ అండ్ ఓన్లీ మైక్ టైసన్‌తో లైగర్ ఫ్యామిలీ’’ అని క్యాప్షన్ ఇచ్చారు.
కిక్ బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈసినిమా తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ బాక్సర్‌గా విభిన్నమైన లుక్‌లో పొడవాటి జుత్తుతో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా బాలీవుడ్ నటి అనన్యా పాండే సందడి చేయనున్నారు. పాన్ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈచిత్రానికి చార్మితోపాటు కరణ్ జోహార్ సైతం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
NFSA Rankings: ‘ఆహార భద్రత’ అమలులో ఒడిశా నంబర్ వన్.. మరి తెలుగు రాష్ట్రాలు!
-
Crime News
Chennai: ‘ఓటీపీ’ వివాదం.. టెకీపై ఓలా డ్రైవర్ పిడిగుద్దులు.. ఆపై హత్య
-
Crime News
NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు
-
General News
Kiren Rijiju: ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. వీడియో చూశారా?
-
Movies News
Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Kaali: ముదురుతున్న ‘కాళీ’ వివాదం.. దర్శకురాలు, నిర్మాతలపై కేసులు
- IAF: యుద్ధ విమానాన్ని కలిసి నడిపిన తండ్రీకూతుళ్లు.. దేశంలోనే తొలిసారి!
- PV Sindhu: ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ
- Regina Cassandra: ఆ విషయంలో చిరంజీవిని మెచ్చుకోవాల్సిందే: రెజీనా
- Shruti Haasan: ఆ వార్తలు నిజం కాదు.. శ్రుతిహాసన్
- Jharkhand: బీటెక్ విద్యార్థినిపై లైంగిక వేధింపులు.. IAS అధికారి అరెస్టు
- NTR Fan Janardhan: జూ.ఎన్టీఆర్ వీరాభిమాని జనార్దన్ కన్నుమూత
- NIA: హైదరాబాద్ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు