Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండ డ్యాన్స్‌ అదిరిపోద్ది: ఛార్మి

యువ నటుడు విజయ్‌ దేవరకొండ మునుపెన్నడూలేని విధంగా డ్యాన్స్‌ చేస్తున్నాడని నటి, నిర్మాత ఛార్మి అన్నారు.

Updated : 16 Sep 2022 14:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువనటుడు విజయ్‌ దేవరకొండ మునుపెన్నడూలేని విధంగా డ్యాన్స్‌ చేస్తున్నాడని నటి, నిర్మాత ఛార్మి అన్నారు. విజయ్‌ కథానాయకుడిగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న ‘లైగర్‌’ చిత్రానికి ఆమె నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్‌ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ‘‘లైగర్‌’ సాంగ్‌ షూటింగ్‌ ముంబయిలో జరుగుతోంది. విజయ్‌ మునుపెన్నడూలేని విధంగా డ్యాన్స్‌ చేస్తున్నాడు. అతని ఎనర్జీని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. తన పెర్ఫామెన్స్‌ని చూస్తూ ఈ పోస్ట్‌ పెడుతున్నా. తెరపై తన డ్యాన్స్‌ అదిరిపోద్ది’ అని పేర్కొన్నారు. సెట్‌లోని ఓ ఫొటోని షేర్‌ చేశారు.

ఈ చిత్రం మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో రూపొందుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. విజయ్‌ సరసన అనన్య పాండే నటిస్తోంది. ప్రముఖ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ్‌ దేవరకొండ మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని