Liger: ‘లైగర్‌’ సంబరం

కొత్త ఏడాది సినీ సంబరాల్లో ‘లైగర్‌’ హంగామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాది ఆరంభానికి మూడు రోజుల ముందు నుంచే ప్రచార సంరంభానికి తెర లేపింది చిత్రబృందం. ఈ నెల 29న సినిమా నుంచి ఓ ప్రకటనకి

Updated : 29 Dec 2021 07:05 IST

కొత్త ఏడాది సినీ సంబరాల్లో ‘లైగర్‌’ హంగామా ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఏడాది ఆరంభానికి మూడు రోజుల ముందు నుంచే ప్రచార సంరంభానికి తెర లేపింది చిత్రబృందం. ఈ నెల 29న సినిమా నుంచి ఓ ప్రకటనకి సంబంధించిన వీడియోని విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు ప్రకటించాయి. 30న ప్రత్యేకమైన చిత్రాల్ని, 31న ఇదివరకు ప్రకటించినట్టుగా టీజర్‌ తరహా ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నారు. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్‌’. అనన్యపాండే కథానాయిక. కరణ్‌ జోహార్‌, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్‌ నిర్మిస్తున్నారు. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌టైసన్‌ ఓ కీలక పాత్రలో సందడి చేస్తారు. ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని