Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ గేమ్‌ షణ్ణుకి ముందే తెలుసు: లోబో

‘బిగ్‌బాస్‌’ గేమ్‌ షణ్ముఖ్‌కు ముందే తెలుసని.. అతను అన్నీ చదివే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని.. యాంకర్‌ లోబో వ్యాఖ్యానించారు. ఇంటిసభ్యులపై తనదైన శైలిలో కామెంట్లు చేసి.. ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది....

Published : 01 Nov 2021 14:20 IST

షాకింగ్‌ కామెంట్లు చేసిన యాంకర్‌

హైదరాబాద్‌: ‘బిగ్‌బాస్‌’ గేమ్‌ షణ్ముఖ్‌కు ముందే తెలుసని.. అతడు అన్నీ చదివే హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని.. యాంకర్‌ లోబో వ్యాఖ్యానించారు. ఇంటిసభ్యులపై తనదైన శైలిలో కామెంట్లు చేసి.. ఎంటర్‌టైనర్‌ ఆఫ్‌ ది బిగ్‌బాస్‌ హౌస్‌గా పేరుపొందిన లోబో ఇటీవల ఎలిమినేటై బయటకు వచ్చారు. దీంతో తాజాగా ఆయన ఆరియానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘బిగ్‌బాస్‌ బజ్‌’లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఇందులో భాగంగా ఇంటి సభ్యులపై తన అభిప్రాయాన్ని లోబో బయటపెట్టారు.

హౌస్‌లోకి ప్రవేశించిన కొత్తలో ఇంటిసభ్యులెవరూ తెలియదని.. అందుకే రవిని కొన్ని వారాలపాటు నామినేట్‌ చేశానని అన్నారు. అనంతరం ఆయన కాజల్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంట్లో ఉన్న సభ్యులందరిలో కాజల్‌ ఎంతో మంచి వ్యక్తి. ఆమె గేమ్‌ బాగా ఆడుతుంది’’ అని లోబో సమాధానమిచ్చారు. తాను చేయాలనుకున్న పనులు చేసేసి.. ఏదైనా తప్పు జరిగితే హౌస్‌మేట్స్‌ అందరిపై సిరి కేకలు వేస్తుందని లోబో అన్నారు. ఇక, షణ్ముఖ్‌ గురించి చెబుతూ.. ‘‘షణ్ముఖ్‌కి ఓ విభిన్నమైన వ్యవహార శైలి ఉంది. ఆయనకు గేమ్‌ మొత్తం ముందే తెలుసు’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని