
Updated : 25 Nov 2021 08:50 IST
Lockdown: లాక్‌డౌన్‌లో ఏం జరిగింది?
శ్రీకాంత్, హృతిక జంటగా నటించిన చిత్రం ‘లాక్‌డౌన్... ద ప్యాండమిక్’. సిరాజ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. డిసెంబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈసందర్భంగా చిత్రబృందం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘‘ప్రేమ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. నిర్మాతగా పలు చిత్రాలు తీసిన సిరాజ్ దర్శకుడిగా కూడా ఈ సినిమాతో విజయవంతం అవుతాడ’’న్నారు. ‘‘లాక్‌డౌన్‌లో ఓ ప్రేమజంటకి ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి. థియేటర్‌తోపాటు, ఓటీటీలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామ’’న్నారు దర్శకనిర్మాత.
Tags :