Radheshyam: ప్రభాస్-పూజా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్.. లవ్ ఆంథమ్ వచ్చేసింది..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటి పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్-పూజా మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు....
హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటి పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రభాస్-పూజా మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘రాధేశ్యామ్’ నుంచి లవ్ ఆంథమ్‌ని చిత్రబృందం విడుదల చేసింది. బుధవారం హిందీ వెర్షన్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన చిత్రబృందం తాజాగా తెలుగుతోపాటు మిగిలిన భాషల్లోనూ లవ్ ఆంథమ్‌ని ప్రేక్షకులతో పంచుకుంది. ‘నగుమోము తారలే’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్‌లో ప్రభాస్-పూజాల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని ఫిదా చేసేలా ఉంది. మనసుని హత్తుకునేలా సాగిన ఈ ప్రేమగీతాన్ని సిద్ద్ శ్రీరామ్ ఆలపించారు. ‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్‌కు మిథున్, మిగిలిన భాషలకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతం అందిస్తోన్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రానికి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో లవర్‌బాయ్ పాత్ర పోషించారు. ఇందులో ఆయన విక్రమాదిత్య అనే హస్తసాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. పూజాహెగ్డే.. ప్రేరణ పాత్రలో సందడి చేయనున్నారు. భాగ్యశ్రీ, ప్రియదర్శి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Jaishankar-Blinken: బ్లింకెన్-జైశంకర్ భేటీకి ముందు.. అమెరికా మళ్లీ అదే స్వరం..!
-
Laddu Auction: బండ్లగూడ జాగీర్ లడ్డూ @ రూ.1.26 కోట్లు
-
Virat In ODI WC 2023: ‘మీరేమన్నారో విరాట్‌కు తెలిస్తే.. మీ పని అంతే’.. కివీస్ మాజీకి శ్రీశాంత్ కౌంటర్
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
Flipkart: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ వచ్చేశాయ్.. ప్రత్యేక ఆఫర్లతో పండగ సేల్
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు