MAA Elections: అక్కడితో నా బాధ్యత పూర్తయ్యింది.. తదుపరి నిర్ణయం అధ్యక్షుడిదే: కృష్ణమోహన్

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్‌ చేసిన ట్వీట్‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు.

Updated : 22 Oct 2021 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల సీసీ ఫుటేజీ కావాలని ప్రకాశ్‌రాజ్‌ చేసిన ట్వీట్‌పై ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌ స్పందించారు. ‘మా’ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌తోనే త‌న బాధ్య‌త పూర్త‌య్యింద‌ని, ఆ తర్వాత జోక్యం చేసుకోవడానికి తనకెలాంటి అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగిన రోజున, కౌంటింగ్‌ జరిగిన సమయంలో కానీ తనకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, అప్పుడే ఫిర్యాదు చేసుంటే చర్యలు తీసుకునేవాడినన్నారు. ఎన్నిక‌ల నాటి సీసీ టీవీ ఫుటేజీ ఇచ్చేందుకు తనకి అధికారం లేదని తెలిపారు. ‘తొలిసారి ఆయన ఫుటేజీ అడిగినప్పుడు పరిశీలించి చెప్తాను అన్నాను. కానీ, ఇస్తానని అనలేదు’ అని అన్నారు. న్యాయ‌స్థానం ఆదేశాల మేర‌కు తాను న‌డుచుకుంటాన‌ని పేర్కొన్నారు. ఇకపై అధికారమంతా అధ్యక్షుడి చేతిలోనే ఉంటుందన్నారు. ఎన్నికల్లో వైకాపా నాయకుల జోక్యముందని ప్రకాశ్‌రాజ్‌ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు నిరాకరించారు.

‘మా’ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ కొన్ని రోజుల క్రితం ఎన్నికల అధికారికి ప్రకాశ్‌ రాజ్‌ లేఖ రాశారు. సీసీ ఫుటేజీ కావాలని అందులో కోరారు. తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని చూపిస్తూ మరోసారి సీసీ ఫుటేజీ ఇవ్వమని ట్విటర్‌ ద్వారా ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌ని ప్రకాశ్‌రాజ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు