MAA Elections: ‘మా’ ఎన్నికల ఫలితాలు రేపే..!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల ఫలితాలు రేపు రాత్రికే ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు వెల్లడించారు. అక్టోబర్‌ 10న నిర్వహించనున్న...

Published : 09 Oct 2021 13:13 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల ఫలితాలు రేపు రాత్రికే ప్రకటించే అవకాశం ఉందని ఎన్నికల సహాయ అధికారి నారాయణరావు వెల్లడించారు. అక్టోబర్‌ 10న నిర్వహించనున్న ‘మా’ పోలింగ్‌ కోసం జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం చేసిన ఏర్పాట్లపై శనివారం ఉదయం నారాయణరావు సమీక్ష నిర్వహించారు. ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులకు పోలింగ్ ప్రక్రియ గురించి వివరించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుందని.. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఓట్ల లెక్కింపు పూర్తైన వెంటనే అదే రోజు రాత్రి ఫలితాలు కూడా ప్రకటించే  అవకాశం ఉందని ఆయన వివరించారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ‘మా’ అధ్యక్ష ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధ్యక్ష పదవి కోసం ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు హోరాహోరీగా తలపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని