Cinema News: స్టార్లు చేయాల్సిన చిత్రం.. ‘మడ్డీ’

‘‘ఒక సినిమాకోసం ఐదేళ్లు కష్టపడ్డారంటే ఆ బృందానికున్న తపన ఎలాంటిదో అర్థమైంది. ఆ కథ కోసం ఓ కుటుంబం మొత్తం  పనిచేసిందని  తెలిశాక   మరింతగా ఆశ్చర్యపోయా. ఈ ప్రయత్నం నచ్చే ‘మడ్డీ’ని తెలుగులో విడుదల...

Updated : 09 Dec 2021 09:26 IST

‘‘ఒక సినిమాకోసం ఐదేళ్లు కష్టపడ్డారంటే ఆ బృందానికున్న తపన ఎలాంటిదో అర్థమైంది. ఆ కథ కోసం ఓ కుటుంబం మొత్తం  పనిచేసిందని  తెలిశాక   మరింతగా ఆశ్చర్యపోయా. ఈ ప్రయత్నం నచ్చే ‘మడ్డీ’ని తెలుగులో విడుదల చేయాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. డా.ప్రగభల్‌ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమే ‘మడ్డీ’. యువన్‌, రిధాన్‌ కృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రేమకృష్ణదాస్‌ నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘తొలిసారి ఈ సినిమా ప్రచార చిత్రాలు చూడగానే ఆసక్తిని రేకెత్తించాయి. ఇలాంటి నేపథ్యంలో సినిమా రాలేదే అనిపించింది. స్టార్‌ కథానాయకులు చేయాల్సిన కథ ఇది. బురదలో సాగే రేసింగ్‌లోనూ, కొండలపైనా సాహసోపేతంగా చిత్రీకరణ చేయాలంటే ఇబ్బందికరం కాబట్టి స్టార్లతో కాకుండా కొత్త నటులతో తీశారు. సినిమా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత దర్శకుడితో మాట్లాడాక తెలిసింది ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన ఆ ఇద్దరు కథానాయకులు దర్శకుడి సోదరులే అని. స్టార్లు ఎవ్వరూ ముందుకొచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనమే ఎందుకు చేయకూడదని ఆలోచించి వాళ్లు ముందుకొచ్చారు. ఈ సినిమా కోసం రెండేళ్లు శిక్షణ తీసుకుని నటించారు. ప్రగభల్‌ తదుపరి చేయనున్న సినిమాకి నేను వెన్నుదన్నుగా ఉండాలని   నిర్ణయించుకున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఒక భిన్నమైన    సినిమాని ప్రేక్షకులకు అందించాలని మేమంతా ఐదేళ్లు కష్టపడి చేశాం. ఆఫ్‌రోడ్‌ మడ్‌ రేస్‌ అనేది భారతదేశంలో కొత్త కాన్సెప్ట్‌. ఈ రేసింగ్‌ కోసం నటులు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని నటించార’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని