PelliSandaD: పెళ్లి సందD.. పాట విడుదల చేసిన రవితేజ

శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ పూర్తిస్థాయి కథానాయకుడిగా వెండితెరపై సందడి చేయనున్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా శ్రీలీల నటించారు...

Updated : 07 Dec 2022 19:50 IST

హైదరాబాద్‌: శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ కథానాయకుడిగా వెండితెరపై సందడి చేయనున్న చిత్రం ‘పెళ్లి సందD’. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా శ్రీలీల నటించారు. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ సినిమా నుంచి ‘మధురా నగరిలో’ అంటూ సాగే పాటను నటుడు రవితేజ విడుదల చేశారు. శ్రీనిధి, నారాయణ నాయర్‌, కాలభైరవ ఈ పాటను ఆలపించారు.

శ్రీకాంత్‌-దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో విడుదలైన సూపర్‌హిట్‌ చిత్రం ‘పెళ్లి సందడి’కి సీక్వెల్‌గా ఈ సినిమా రానుంది. ఈ సినిమాతో రాఘవేంద్రరావు నటుడిగా వెండితెరపై సందడి చేయనున్నారు. లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో రావురమేశ్‌, ప్రకాశ్‌రాజ్‌, ఝాన్సీ, హేమ, తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని