Maestro: మాస్ట్రో ప్రమోషనల్‌ సాంగ్‌ వచ్చేసింది

నితిన్‌, నభా నటేష్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘మాస్ట్రో’. హిందీ సూపర్‌ హిట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాదున్‌’ సినిమాకిదీ తెలుగు రీమేక్‌. డిస్నీ+హాట్‌స్టార్‌లో....

Published : 12 Sep 2021 17:25 IST

హైదరాబాద్‌: నితిన్‌, నభా నటేష్‌లు హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘మాస్ట్రో’. హిందీ సూపర్‌ హిట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధున్‌’ సినిమాకిదీ తెలుగు రీమేక్‌. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ నెల 17 నుంచి సందడి చేయనుంది. ఈనేపథ్యంలో సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘షురూ కరో’ అనే ప్రచార గీతాన్ని రూపొందించారు. తాజాగా ఈ పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో హీరో లైఫ్‌ గురించి, కీలకపాత్రల గురించి ఈ పాటతో చిత్రబృందం పరిచయం చేసింది. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని