Updated : 09 Aug 2021 12:26 IST

SarkaruVaariPaata: సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌ అదరహో

మహేశ్‌ పెర్ఫామెన్స్‌కి టేక్‌ ఏ బౌ

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ నుంచి స్పెషల్‌ వీడియో విడుదలైంది. మహేశ్‌ బర్త్‌డేని పురస్కరించుకుని ఆగస్టు 9న ‘సూపర్‌స్టార్‌ బర్త్‌డే బ్లాస్టర్‌’ పేరుతో ఈ వీడియో విడుదల చేశారు. మునుపెన్నడూ లేనివిధంగా ఇందులో మహేశ్‌ మరింత యంగ్‌గా‌ కనిపించారు. ఆయన చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌లు, కీర్తిసురేశ్‌తో లవ్‌ ట్రాక్‌ ఇలా ప్రతిదీ అదరహో అనేలా ఉంది.

‘ఇఫ్‌ యూ మిస్‌ ది ఇంట్రస్ట్‌ యు విల్‌ గెట్‌ ది డేట్‌’ అంటూ రౌడీలతో మహేశ్‌ చెప్పే డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి. ‘సార్‌ పడుకునే ముందు ప్రతి రోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి’ అంటూ మహేశ్‌ అందం గురించి కీర్తి చెప్పే డైలాగ్‌, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌.. వావ్‌ అనిపిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ బర్త్‌డే రోజున విడుదలైన ఈ వీడియోతో అభిమానులకు ఫుల్‌ ట్రీట్‌ లభించినట్లే అయ్యింది.

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం తర్వాత మహేశ్‌ నటిస్తున్న చిత్రమే ‘సర్కారువారి పాట’. పవర్‌ఫుల్‌, యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా సిద్ధమవుతోంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా షూట్‌ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘సర్కారువారి పాట’ విడుదల కానుంది.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని