Pushpa: అల్లు అర్జున్‌ ‘పుష్ప’.. తెర వెనక ఎంత కష్టపడ్డారో..!

‘పుష్ప’ మేకింగ్‌ వీడియో. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా సుకుమార్‌ తెరకెక్కించిన చిత్ర విశేషాలు...

Published : 27 Dec 2021 01:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అల్లు అర్జున్‌లోని పూర్తిస్థాయి మాస్‌ కోణాన్ని చూపించిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను సోషల్ మీడియా వేదికగా ఆదివారం విడుదల చేసింది. యాక్షన్ సీన్లు, పాటలకు సంబంధించిన చిత్రీకరణ ఎలా సాగిందో ఇందులో చూడొచ్చు. అడవిలో సెట్స్‌ ఎలా రూపొందించారో, నటులు, దర్శకుడి మధ్య సంభాషణలు ఎలా సాగాయో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా చిత్రీకరణను చూసేందుకు విచ్చేసిన దర్శకుడు వి.వి. వినాయక్‌, అల్లు అర్జున్‌ తనయ అర్హ సరదాల్నీ ఈ వీడియోలో బంధించారు.

‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి ప్రేమకథల తర్వాత సుకుమార్‌- అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో తెరకెక్కింది ‘పుష్ప’. కథానాయికగా రష్మిక, ప్రతినాయకులుగా సునీల్‌, ఫహద్‌ ఫాజిల్‌ ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం ఉర్రూతలూగించింది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా సంస్థలు నిర్మించిన ఈ చిత్రం తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదలైంది. ఈ సినిమా రెండో భాగం వచ్చే ఏడాదిలో ప్రారంభంకానుంది. 

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని