Arjuna Phalguna: శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’.. ఇలా తెరకెక్కించారు!

వైవిధ్యభరిత కథలతో ఆకట్టుకునే నటుడు శ్రీవిష్ణు. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో పలకరించిన ఈయన ఇప్పుడు మరో సినిమాతో సందడి చేయబోతున్నారు.

Published : 29 Dec 2021 16:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కెరీర్‌ ప్రారంభం నుంచీ వైవిధ్యభరిత కథలతో ఆకట్టుకునే నటుడు శ్రీవిష్ణు. ఈ ఏడాది ఇప్పటికే రెండు చిత్రాలతో పలకరించిన ఈయన ఇప్పుడు మరో సినిమాతో సందడి చేయనున్నారు. తేజ మర్ని దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృత అయ్యర్‌ కథానాయిక. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 31న ప్రేక్షకుల ముందుకురానంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. సరదా సన్నివేశాలు, కొన్ని పోరాట దృశ్యాలతో ఈ వీడియో ఆసక్తిగా సాగింది. చాలా సరదాగా ఈ సినిమా షూటింగ్‌ జరిగినట్టు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ సంవత్సరం.. ‘గాలి సంపత్‌’, ‘రాజ రాజ చోర’ చిత్రాలతో శ్రీవిష్ణు మంచి విజయం అందుకున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని