Bigg boss telugu 5: డబ్బులు వద్దనుకున్నారు.. మానస్‌ ఎలిమినేట్‌ అయ్యాడు

బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి మానస్‌(Manas) ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఫినాలే సందర్భంగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’

Updated : 19 Dec 2021 21:25 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5 నుంచి మానస్‌ (Manas) ఎలిమినేట్‌ అయ్యాడు. బిగ్‌బాస్‌ సీజన్‌-5 ఫినాలే సందర్భంగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ టీమ్‌ నాని, సాయి పల్లవి, కృతిశెట్టి వచ్చి హౌస్‌లో సందడి చేశారు. ఈ సందర్భంగా హౌస్‌లోకి వెళ్లిన వీళ్లు టాప్‌-4లో ఉన్న నలుగురికి డబ్బులు ఆఫర్‌ చేశారు. ‘ఇప్పుడు.. ఈ సమయంలో ఎవరైనా ఈ సూట్‌కేస్‌లో ఉన్న డబ్బు కావాలనుకుంటే తీసుకుని వెళ్లిపోవచ్చు’ అని నాని ఆఫర్‌ ఇవ్వగా, నలుగురూ తిరస్కరించారు. రెండోసారి కూడా ఆఫర్‌ ఇస్తానని నాగార్జున ప్రకటించినా తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు. అనంతరం జరిగిన ఎలిమినేషన్‌లో మానస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చాడు.

ఈ సందర్భంగా వేదికపైకి వచ్చిన మానస్‌ మాట్లాడుతూ.. ‘‘జర్నీ అద్భుతంగా ఉంది. హౌస్‌మేట్స్‌ హృదయాలను గెలుచుకున్నా. మనకు ఎంత ఓపికున్నా తక్కువేనని ఇక్కడ నేర్చుకున్నా. బిగ్‌బాస్‌ సీజన్‌-5 టైటిల్‌ గెలుచుకోవాలన్న ఫైర్‌ సన్నీలో ఎక్కువగా ఉంది. ఇన్ని రోజులు జర్నీ చేశాడు కాబట్టి కచ్చితంగా ప్రేక్షకుల మనసును గెలుచుకుని ఉంటాడు. ఎవరి స్టైల్‌లో వాళ్లు ప్రయత్నించారు. ఎవరు టైటిల్‌ గెలిచినా మేమంతా ఏదో ఒకటి సాధించాం. ఇంత దూరం వచ్చామంటే మాలో ఏదో ఒక పాయింట్‌ ప్రేక్షకులకు నచ్చే ఉంటుంది. ఎవరు ఎక్కువ నచ్చితే వాడే విన్నర్‌’’ అని సమాధానం ఇచ్చాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని